HYD: ఈనెల 14 నుంచి ప్రారంభం కానున్న 10వ తరగతి పరీక్షల ఏర్పాట్లను అధికారులు చురుగ్గా చేస్తున్నారు. ఖైరతాబాద్ జోన్ పరిధిలో షేక్‌పేట, ఖైరతాబాద్ మండలాలు వస్తాయి. మొత్తం 9,193 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరి కోసం 35 కేంద్రాలు ఏర్పాటు చేశారు. 8 ప్రభుత్వ పాఠశాలలు, 27 ప్రైవేటు పాఠశాలల్లో సెంటర్లు ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాల్లో పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు.