విశాఖలోని గాంధీ విగ్రహం పార్క్ వద్ద జీవీఎంసీ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్, సీఐటీయూ ఆధ్వర్యంలో రిటైర్మెంట్ కార్మికులు శుక్రవారం దీక్షలు చేపట్టారు. అప్కోస్ వర్కర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్లు, మరణించిన కార్మికుల పిల్లలకు ఉపాధి కల్పించాలని యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.