PDPL: 99 రోజుల కార్యక్రమాన్ని అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో విజయవంతం చేయాలని కలెక్టర్ శ్రీ హర్ష తెలిపారు. శుక్రవారం పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు. మార్చి 6 నుంచి 15 వరకు జరిగే ప్రత్యేక డ్రైవ్లో ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. కౌన్సిలర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాలన్నారు.