AP: కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ఢిల్లీలో భేటీ అయ్యారు. శ్రీకాకుళం జిల్లాలో రైల్వే మౌలిక సదుపాయాల బలోపేతం, శ్రీకాకుళం నుంచి సికింద్రాబాద్, తిరుపతి నగరాలకు డైరెస్ట్ రైళ్లను నడపడంపై చర్చించినట్లు తెలిపారు. అలాగే ధోలేరా అంతర్జాతీయ విమానాశ్రయం పురోగతిపై కూడా అశ్వినీ వైష్ణవ్‌తో చర్చించామని పేర్కొన్నారు.