PLD: పెదకూరపాడు అంగన్వాడీ 3వ సెంటర్లో శనివారం బాల్య వివాహాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. icds ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి హెచ్ఎం రమణ పాల్గొన్నారు. చిన్న వయసులో పిల్లలకు పెళ్లి చేయడం ద్వారా గర్భం దాల్చినప్పుడు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి నెలకొంటుందని తెలిపారు. పిండం అభివృద్ధి చెందక అంగవైకల్యం కలిగిన బిడ్డలు పుట్టే అవకాశం ఉందన్నారు.