KRNL: భారతీయ జనతా పార్టీ కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాస ఆచారి నియమితులయ్యారు. విద్యార్థి దశ నుంచే పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్న సేవలను గుర్తించి పార్టీ ఈ బాధ్యతలు అప్పగించింది. జిల్లాలో పార్టీ బలోపేతానికి, యువతను ఆకర్షించేందుకు కృషి చేస్తానని ఆయన తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తానన్నారు.