HYD: మార్చి 3న కేతు గ్రస్త సంపూర్ణ చంద్ర గ్రహణం సందర్భంగా సికింద్రాబాద్లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవస్థానం ఉభయ ఆలయాలు మూసివేయనున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. 3న ఉదయం 8 గంటలకు ఆలయాల తలుపులు మూసివేసి దర్శనాలు నిలిపివేస్తారు. తిరిగి 4న ఉదయం 9 గంటలకు మహా మంగళహారతితో ఆలయాలు తిరిగి తెరిచి భక్తులకు దర్శనం కల్పిస్తామని వెల్లడించారు. భక్తులు సహకరించాలని కోరారు.