SKLM: ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన నూతన బీటీ పత్తి రకం ‘లాం బీజీ టూ-2208’ను మంత్రి అచ్చెన్నాయుడు విడుదల చేశారు. రైతుల విత్తన ఖర్చు తగ్గించి హెక్టారుకు 32-35 క్వింటాళ్ల దిగుబడి ఇచ్చే ఈ రకం ప్రభుత్వ రంగంలో తొలి బీటీ పత్తి రకమన్నారు. సూటి రకం కావడంతో రైతులు తిరిగి విత్తనం వాడుకోవచ్చని మంత్రి తెలిపారు.