MDK: పాపన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలో పోగొట్టుకున్న 10 సెల్ఫోన్లను రికవరీ చేసి బాధితులకు ఎస్సై గురువారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఈఐఆర్ (CEIR) పోర్టల్ సహాయంతో ప్రత్యేక చర్యలు చేపట్టి, ఇప్పటివరకు 553 ఫోన్లను ట్రేస్ చేశామన్నారు. అందులో రికవరీ చేసిన మొత్తం 544 సెల్ఫోన్లను ఇప్పటివరకు బాధితులకు సురక్షితంగా అప్పగించినట్లు ఎస్సై వివరాలు వెల్లడించారు.