ASR: మన ప్రాంతంలో పండే కాఫీకి ప్రపంచవ్యాప్తంగా విశేష గుర్తింపు ఉందని కలెక్టర్ నిశాంతి కొనియాడారు. రసాయన ఎరువులు లేకుండా సహజ పద్ధతుల్లో పండించే ఈ కాఫీని అంతర్జాతీయ మార్కెట్లో ఆర్గానిక్ కాఫీ బ్రాండ్‌గా ప్రమోట్ చేయడమే మన ప్రధాన లక్ష్యమన్నారు. గురువారం జిల్లాస్థాయి కాఫీ సమావేశం నిర్వహించారు. అంతర్జాతీయ నాణ్యత ప్రమాణాలు అందుకోవడానికి రైతులు సిద్ధం కావాలన్నారు