కృష్ణా: గన్నవరం మండలంలో వైసీపీ ఆధ్వర్యంలో “వెన్నుపోటుకు రెండేళ్లు” కార్యక్రమం నిర్వహించారు. జెడ్పీటీసీ అన్నవరపు ఎలిజబెత్ రాణి నేతృత్వంలో టీడీపీ మేనిఫెస్టో, సూపర్ సిక్స్ హామీల ప్రతులను దగ్ధం చేసి నిరసన తెలిపారు. ఎన్నికల హామీలు అమలు చేయకుండా మహిళలు, రైతులు, నిరుద్యోగులను ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు.