CTR: చిత్తూరు పట్టణంలోని మిట్టూరు ప్రాంతంలో జరిగిన భారీ చోరీ కేసును చిత్తూరు పోలీసులు ఛేదించారు. సుమారు రూ.38 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకొని ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను అరెస్ట్ చేశారు. నిందితులపై కర్ణాటకలో 17 కేసులు, ఆంధ్రప్రదేశ్లో 3 కేసులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.