MDK: రైతులు అధైర్య పడొద్దు, చివరి గింజ వరకూ ధాన్యం కొంటామని జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్ పేర్కొన్నారు. జిల్లాలో 71,327 మంది రైతుల నుంచి 3,50,620.680 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి, 57,496 మంది రైతులకు రూ. 616.93 కోట్లు చెల్లింపులు చేసినట్లు వివరించారు. జిల్లాలో 200 ధాన్యం కొనుగోలు కేంద్రాలు మూసి వేసినట్లు కలెక్టర్ వివరించారు.