TG: అమీర్పేట్లో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై జూబ్లీహిల్స్ MLA నవీన్ యాదవ్ స్పందించారు. షార్ట్ సర్య్కూట్ కారణంగా ఇది జరిగిందని అంటున్నారని, మరికొందరు రెస్టారెంట్ వేడి వల్ల ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని చెబుతున్నారని తెలిపారు. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణహాని జరగలేదని, విచారణ జరుగుతోందన్నారు. త్వరలో బాధితులకు నష్టపరిహారం ఇవ్వడానికి ప్రయత్నిస్తామన్నారు.