MBNR: మహబూబ్నగర్లో ప్రమాదకర బైక్ స్టంట్లు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీసీటీవీ ఆధారాలతో వారిని గుర్తించి కౌన్సిలింగ్ ఇచ్చారు. రోడ్డు భద్రతకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవని పోలీసులు తెలిపారు. మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై కూడా చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.