AKP: అచ్యుతాపురం మండలం తిమ్మరాజుపేట, కొండకర్ల, దోసూరు గ్రామాల్లో సోమవారం భవన నిర్మాణ కార్మికుల సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఆర్.రాము మాట్లాడుతూ.. సంక్షేమ బోర్డు పునరుద్ధరించినప్పటికీ కార్మికులకు గతంలో అమలైన 11 సంక్షేమ పథకాల స్థానంలో ప్రస్తుతం నాలుగు మాత్రమే అమలు చేస్తున్నారని విమర్శించారు.