BHPL: మహాదేవపూర్ మండలం కాలేశ్వరంలో సరస్వతి నది అంత్య పుష్కరాలు నేటితో ముగియనున్నాయి. దీంతో తెలంగాణతో పాటు, వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరిస్తున్నారు. అనంతరం శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. దీంతో పుష్కర ఘాట్లో వద్ద రద్దీ నెలకొంది.