TG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి నిన్న రికార్డు స్థాయిలో భక్తులు తరలివచ్చారు. ఒకే రోజు ఏకంగా 1.01 లక్షల మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ ఈవో అధికారికంగా ప్రకటించారు. సెలవు దినం కావడంతో తెల్లవారుజాము నుంచే భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది.