AP: వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 943 రకాల సేవలు అమలు చేసినట్లు మంత్రి లోకేష్ అన్నారు. వాట్సాప్ గవర్నెన్స్‌కు AIని జోడించి యూజర్ ఫ్రెండ్లీగా మార్చామని తెలిపారు. వేగంగా స్పందించడం, రసీదు రావాలనే అంశాలపై దృష్టి సారిస్తామని పేర్కొన్నారు. సభ్యులు కూడా క్షేత్రస్థాయి పరిస్థితులపై ఫీడ్ బ్యాక్ ఇవ్వాలని, మనమిత్ర 2.0ను కూడా ప్రారంభించాలని యోచనలో ఉన్నట్లు వెల్లడించారు.