CTR: సదుం మండలంలో సమస్యల పరిష్కారానికి అందరి సహకారంతో కృషి చేస్తామని ZPTC సోమశేఖర్ రెడ్డి తెలిపారు. మండల మీట్ ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం జరిగింది. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చొరవతో గతంలో నిర్మించిన ప్రాజెక్టులతో ఎక్కడా తాగునీటి సమస్య లేదని ఆయన చెప్పారు. సమస్యలు తెలిపితే వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.