సత్యసాయి: పరిగి మండలంలోని ధనాపురం సిరే కోలం పంచాయతీలో శుక్రవారం గ్రామ రెవెన్యూ సదస్సు నిర్వహించారు. గ్రామ రైతుల భూ సమస్యలు, రెవెన్యూ సంబంధిత అంశాలపై చర్చించి పలు సమస్యలను అధికారులు అర్జీలు స్వీకరించారు. పరిగి మండల టీడీపీ కన్వీనర్ గోవింద్ రెడ్డి మాట్లాడుతూ.. రైతులకు ప్రభుత్వ సేవలు పారదర్శకంగా అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.