TG: కాళేశ్వరంలో గోదావరి త్రివేణి సంగమం వద్ద ఇవాళ్టి నుంచి సరస్వతి అంత్య పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. కంచి పీఠాధిపతి పుణ్యస్నానం ఆచరించి వీటిని ప్రారంభిస్తారు. జూన్ 1 వరకు జరిగే ఈ వేడుకలకు 40 లక్షల మంది భక్తులు వస్తారని అధికారుల అంచనా. భక్తుల వసతుల కోసం ప్రభుత్వం రూ.30.63 కోట్లతో భారీ ఏర్పాట్లు చేసింది. ఇవాళ గవర్నర్తో పాటు పలువురు మంత్రులు ఇక్కడికి రానున్నారు.