నలగొండ జిల్లాలో భూముల ప్రభుత్వ విలువలను భారీగా పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది. బహిరంగ మార్కెట్ ధరలకు అనుగుణంగా ప్రాంతాన్ని బట్టి 50 శాతం నుంచి 100 శాతం వరకు ధరలను పెంచనున్నారు. ముఖ్యంగా పట్టణాల్లోని ప్రధాన ప్రాంతాల్లో అత్యధికంగా 100 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది.పెరిగిన ఈ కొత్త చార్జీలు ఈ నెల 26 లేదా 28వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి.