NZB: వృద్ధురాలిని నమ్మించి ఆమె మెడలో నుంచి రెండు తులాల బంగారు గొలుసు, నగదును ఆటో డ్రైవర్ దొంగిలించినట్లు 3 టౌన్ ఎస్ఐ హరిబాబు తెలిపారు.కెనాల్ కట్ట ప్రాంతానికి చెందిన ఓ వృద్ధురాలు ఉదయం శుభకార్యానికి వెళదామని ఆటో ఎక్కింది. ఆటో డ్రైవర్ వృద్ధురాలని నిర్మానుష ప్రదేశానికి తీసుకెళ్లి ఆమె మెడలో నుంచి రెండు తులాల బంగారు గుండ్లు, నగదును లాక్కొని పారిపోయాడు.