SRPT: కోదాడ మండల పరిధిలోని శ్రీరంగాపురం గ్రామంలో బుధవారం పోలీసు ప్రజా భరోసా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో గ్రామస్తులకు చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పట్టణ సీఐ శివశంకర్ మాట్లాడుతూ.. ప్రజలకు అత్యంత చేరువగా ఉండి సేవలు అందించడమే పోలీసుల లక్ష్యమన్నారు.