ATP: ఎమ్మెల్యే బండారు శ్రావణి తన క్యాంపు కార్యాలయంలో ‘ప్రజా దర్బార్’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజల నుంచి వివిధ సమస్యలపై అర్జీలను స్వీకరించారు. బాధితుల సమస్యలను అడిగి తెలుసుకుని, అర్జీలను పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామన్నారు.