ATP: కూడేరు మండలం అంతరగంగ గ్రామంలో టీటీడీ శ్రీవాణి ట్రస్టు ద్వారా నిర్మిస్తున్న రాములవారి దేవస్థానానికి పెండింగ్ నిధులను విడుదల చేయాలని టీడీపీ నేత శ్రీకాంత్ కోరారు. గురువారం ఆయన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. ఆలయ నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసేందుకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని వివరించారు.