మార్కాపురం ఇంఛార్జ్ ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆధ్వర్యంలో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా మహిళలు–చిన్నారుల నేరాల నివారణ, పెండింగ్ కేసుల త్వరిత పరిష్కారంపై ఆదేశాలు ఇచ్చారు. రోడ్డు ప్రమాదాల తగ్గింపు, డ్రంక్ అండ్ డ్రైవ్, మైనర్ డ్రైవింగ్, గంజాయి–సైబర్ నేరాలపై కఠిన చర్యలు, అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. డీఎస్పీతో పాటు సీఐలు పాల్గొన్నారు.