కాకినాడ: కరప మండలం జె.భావవరంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం రూరల్ MLA పంతం నానాజీ ప్రారంభించారు. మండలంలోని 16 రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం సేకరిస్తున్నట్లు తెలిపారు. మొదటి ట్రాక్టర్ లోడ్‌కు జెండా ఊపి పనులు మొదలుపెట్టారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ AD బాబూరావు, AO సత్య, సొసైటీ అధ్యక్షులు, CEOలు పాల్గొన్నారు.