ASR: ఈనెల 26వ తేదీన అనంతగిరిలోని ఎంపీడీవో కార్యాలయం వద్ద ప్రజావేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు టీడీపీ అరకు నియోజకవర్గ ఇంఛార్జ్ సియ్యారి దొన్నుదొర బుధవారం అన్నారు. ఉదయం 10:30కు ప్రారంభమయ్యే ప్రజా వేదికకు 24 పంచాయితీల ప్రజలు వారి సమస్యలను అర్జీల రూపంలో సమర్పించవచ్చన్నారు. గ్రీవెన్స్‌కు వచ్చే వారంతా ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకురావాలన్నారు.