సోషల్ మీడియా వేదికగా మెగా ఫ్యామిలీ, Dy.CM పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన స్టాండప్ కమెడియన్ అనుదీప్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్టాండప్ కామెడీ షోల పేరుతో పవన్ మూడు వివాహాలను ఉద్దేశిస్తూ, అలాగే మెగా కుటుంబానికి చెందిన నిహారిక కొణిదెల విడాకుల వ్యవహారాన్ని జోడిస్తూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి.