AP: వైసీపీ సోషల్ మీడియా ఇంఛార్జ్‌కు కుప్పం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సీఎం చంద్రబాబుపై అభ్యంతరకర పోస్టులు, రెడ్ బుక్’ అంశంపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినట్లు ఆరోపణలు రావడంతో గిరీష్ కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా ఈ కేసు విచారణ చేపట్టిన కోర్టు A1 నిందితుడిగా ఉన్న అతడికి బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు ఉత్తర్వులిచ్చింది.