CTR: మహిళలు బాలికల భద్రత కోసం రూపొందించిన శక్తి యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు సూచించారు. చిత్తూరు స్త్రీ శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలో మహిళల భద్రత, పిల్లల రక్షణపై శక్తి టీం ఆధ్వర్యంలో బుధవారం అవగాహన కల్పించారు. మహిళల భద్రత కోసం పోలీసు శాఖ నిరంతరం అప్రమత్తంగా ఉంటుందని ఆయన వెల్లడించారు.