AP: జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యత గౌరవంగా ఉందని మంత్రి లోకేష్ అన్నారు. ‘పార్టీ నాపై ఉంచిన నమ్మకానికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటా. సాధారణ కార్యకర్తగా ప్రారంభించి ఈ స్థాయికి చేరడం గర్వంగా ఉంది. కార్యకర్తల పోరాటాలు, త్యాగాలు నాకు తెలుసు. రాష్ట్రానికి నిజాయితీతో, నిబద్ధతతో సేవ చేసేందుకు నిరంతరం శ్రమిస్తాను. నాకు వచ్చింది పదవి కాదు.. కీలక బాధ్యత’ అని అన్నారు.