AP: పార్టీ కమిటీల్లో సామాజిక న్యాయం పాటించామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. కమిటీలలో పదవులు పొందినవారికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కమిటీలు ప్రభావవంతంగా పని చేయాలని సూచించారు. TDPలో పని చేయడమంటే రాష్ట్రాభివృద్ధికి పని చేయడమేనని అన్నారు. పార్టీతో అనుబంధం, కష్టపడే తత్వం ఉన్నవారికి కమిటీల్లో ప్రాధాన్యం ఇచ్చామన్నారు.