GNTR: భారత్‌నెట్, పీఎం-వాణీ పబ్లిక్ వైఫై విస్తరణపై కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సమీక్షించారు. సేవలను ప్రజలకు మరింత సులభంగా అందించే మార్గాలపై చర్చించారు. అమలు ప్రక్రియలు, వ్యయ నిర్మాణంపై పలు సూచనలు చేశారు. దేశంలోని మారుమూల ప్రాంతాలకు సైతం నాణ్యమైన ఇంటర్నెట్ అందించడమే లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు.