KNR: జమ్మికుంట పట్టణ బీజేపీ నూతన కార్యవర్గాన్ని జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ప్రకటించారు. ఉపాధ్యక్షుడిగా గర్రపల్లి నిరుపరాణి, అడువాల కుమార్, కొమ్ము అశోక్, కేశ స్వరూప కాగా, ప్రధాన కార్య దర్శులుగా కైలాసకొటి గణేశ్, రాచపల్లి ప్రశాంత్ నియామకమయ్యారు. మొత్తం 45 మంది సభ్యులతో కూడిన బృందాన్ని నియమిస్తూ పట్టణ అధ్యక్షుడు కొలకాని రాజుకు ఉత్తర్వులు జారీ చేశారు.