హీరోలు నాని, దుల్కర్ సల్మాన్‌లు తనకు మంచి స్నేహితులని బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ తెలిపింది. చిత్ర పరిశ్రమలో వారు తనకు ఎంతో అండగా నిలుస్తారని, తమ మధ్య మంచి అనుబంధం ఉందని ఆమె పేర్కొంది. గతంలో ‘సీతారామం’లో దుల్కర్‌తో, ‘హాయ్ నాన్న’లో నానితో మృణాల్ కలిసి నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్లుగా నిలిచిన సంగతి తెలిసిందే.