IPL 2026లో ఇవాళ వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ తలపడనున్న సంగతి తెలిసిందే. ఇక్కడ ఇరుజట్ల మధ్య జరిగిన 10 మ్యాచ్‌ల్లో పంజాబ్ 5 గెలిచింది. మొత్తంగా 34 మ్యాచ్‌ల్లోనూ 17-17తో PBKS సగం విజయాలు అందుకొంది. పైగా ఈ టోర్నీలో అజేయంగా రాణిస్తోంది. మరోవైపు MI ఆడిన 4 మ్యాచ్‌లకు ఒక్కటే గెలిచింది. మరి ముంబై తమ సొంతమైదానంలో పంజాబ్‌పై ఎలా ఆడుతుందో చూడాలి.