NZB: ధర్పల్లి మండల పరిషత్ కార్యాలయంలో ఇవాళ ఉదయం 8:30 గంటలకు ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ మండల స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. 99 రోజుల కార్యాచరణ, అభివృద్ధి పనులపై చర్చించనున్నట్లు ఎంపీడీవో లక్ష్మారెడ్డి తెలిపారు. ఈ సభకు 22 గ్రామాల సర్పంచులు, అధికారులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని సూచించారు. మండల ప్రగతిపై ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.