TG: రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష(TG TET) దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. మొదటి రోజే భారీ స్పందన లభించింది. నిన్న సాయంత్రం 7:30 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 4,797 మంది అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులకు ఈనెల 30వ తేదీ వరకు అవకాశం కల్పించారు.