KMM: వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ గురువారం సింగరేణి మండలం గాదెపాడు గ్రామంలో పర్యటించనున్నట్లు గ్రామ సర్పంచ్ రంజిత్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా గ్రామంలోని నూతనంగా నిర్మితమైన ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవం, రూ. 8 లక్షలతో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొంటారని ఆయన తెలిపారు.