SRPT: రహదారి భద్రతపై మోతె మండలం సర్వారం గ్రామస్థులు వినూత్న ప్రచారం చేపట్టారు. ‘హెల్మెట్ లేనిదే గ్రామంలోకి రావద్దు’ అని శివారులో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. “తల పోతే నాలాగా మళ్ళీ పొందలేరు” అంటూ వినాయకుడి బొమ్మతో పెట్టిన నినాదం అందరినీ ఆకట్టుకుంటోంది. ఎస్సై అజయ్ కుమార్ చేపట్టిన ‘అరైవ్ అలైవ్’ స్ఫూర్తితో ప్రజలే స్వచ్ఛందంగా ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం.