PDPL: GDK జనరల్ ఆసుపత్రిని కలెక్టర్ శ్రీహర్ష ఇవాళ ఆకస్మిక తనిఖీ చేశారు. పలు వార్డులలో పర్యటించి, అందుతున్న సేవలపై రోగులను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి ఆవరణలో సీసీ రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ల్యాబ్ యంత్రాలు, ఏసీ పరికరాలు పాడైనచో వెంటనే మరమ్మత్తు చేపించాలని సూచించారు. ఆయన వెంట సిబ్బంది, అధికారులు ఉన్నారు.