NLG: నార్కట్ పల్లి మండలం బ్రాహ్మణవెల్లంల గ్రామానికి చెందిన మాజీ వార్డ్ మెంబర్ సిరసనవాడ వెంకన్న తల్లి సిరసనవాడ లక్ష్మమ్మ అనారోగ్యంతో శుక్రవారం మరణించింది. విషయం తెలుసుకున్న మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బత్తుల ఉషయ్య ఆమె భౌతిక కాయానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.