WGL: వరంగల్ నగరంలోని లక్ష్మీపురం కూరగాయల మార్కెట్ సమీపంలో గంజాయి మత్తులో ఉన్న వ్యక్తులు హల్చల్ చేశారు. మార్కెట్లో పనిచేస్తున్న హమాలి సూరయ్య అనే వ్యక్తిపై దాడి చేశారు. ఈ దాడిలో గాయపడిన సూరయ్యను వెంటనే ఎంజీఎం ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. పోలీసులు ఘటనపై వివరాలు సేకరిస్తున్నారు.