BHNG: భక్తుల ప్రాణ భద్రతకు ప్రాధాన్యతనిస్తూ యాదగిరిగుట్టలో SPF సిబ్బందికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. TG SPF డీజీ స్వాతి లాక్రా ఆదేశాల మేరకు బుధవారం కొండపై ఈ శిక్షణ చేపట్టారు. అత్యవసర పరిస్థితుల్లో తక్షణ స్పందనకు అవసరమైన నైపుణ్యాలపై నిపుణులు సిబ్బందికి అవగాహన కల్పించారు. సంభవించిన సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రక్షణ చర్యల ఫై సూచనలు చేశారు.