కర్నూలుకు చెందిన కె. పద్మలతా రెడ్డి టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా ఇవాళ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేశారు. కార్పొరేటర్‌గా పనిచేసిన ఆమె పార్టీకి విశేష సేవలు అందించారు. కర్నూలు నుంచి మహిళగా ఈ పదవికి ఎంపిక కావడం ఇదే తొలిసారి. ఆమె నియమకం పట్ల పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.