NLG: మే1- 7వరకు జరిగే వారోత్సవాలను పల్లె పల్లెనా వాడవాడనా కార్మిక వర్గం పెద్ద ఎత్తున జయప్రదం చేయాలని CITU రాష్ట్ర కమిటీ సభ్యుడు లక్ష్మీనారాయణ కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. నేడు నిడమనూరులో CITU మండల కన్వీనర్ గురువయ్య అధ్యక్షతన జరిగిన సమావేశానికి హాజరైన ఆయన, మాట్లాడారు. కార్మిక వర్గం తమ హక్కుల కోసం పోరాడి సాధించిన స్ఫూర్తిగా ‘మే’ డే వచ్చిందన్నారు.