JGL: మల్లాపూర్ మండలం రాఘవపేట ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డా. నరేందర్ సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్రంలో రోగులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. అలాగే టీకాల నిర్వహణ, రికార్డుల నిర్వహణపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం రిజిస్టర్లను తనిఖీ చేసి, సేవలను మరింత మెరుగుపర్చాలని సిబ్బందికి సూచించారు.